49 ఏళ్ల తర్వాత సెమీస్‌లో భారత హాకీ జట్టు
టోక్యో (CLiC2NEWS): ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల జట్టు అదరగొట్టింది. క్వార్టర్స్ ఫైనల్స్‌లో బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత భారత్ ఈ ఘనత సాధించింది. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. 49 ఏళ్ల విరామం తర్వాత సెమీస్‌కు అర్హత సాధించింది.
మ్యాచ్ తొలి క్వార్టర్ లో ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోల్ చేయగా.. రెండో క్వార్టర్లో 16వ నిమిషంలో గుర్జత్ సింగ్ మరో గోల్ సాధించాడు. హార్దిక్ సింగ్(57వ) గోల్స్ చేశారు. బ్రిటన్ జట్టులోని సామ్ వార్డ్ ఏకైక్ గోల్ చేశాడు.
గ్రేట్ బ్రిటన్‌తో ఆదివారం జరిగిన ఈ క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో 3-1 తేడాతో గెలిచిన భారత్ సెమీస్‌లో బెల్జియంతో మంగళవారం తలపడనుంది.
1972 ఒలింపిక్స్‌లో చివరగా సెమీస్ ఆడిన భారత జట్టు.. పాకిస్థాన్ చేతిలో 0-2 తేడాతో ఓటమిపాలైంది.