భారత వైద్య విద్యార్థులకు శుభవార్త.. విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు!
ఢిల్లీ (CLiC2NEWS): మన దేశ వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఇకనుండి విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చని వైద్యారోగ్యశాఖ తెలిపింది. భారత్‌లో మెడిసిన్ చేసినవారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పిజి కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేయొచ్చని వెల్లడించారు. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (WFME) నుండి జాతీయ వైద్య మండలి (NMC) రాబోయే 10 ఏళ్ల కాలనాకి గుర్తింపు వచ్చినట్లు ప్రకటనలో పేర్కొంది. దీంతో 2024 నుండి మన దేశ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు. మనదేశంలో ప్రస్తుతం ఉన్న 706 మెడికల్ కాలేజీలకు దీనివలన అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. WFME గుర్తింపు వలన భారత్‌లో అందించే వైద్య విద్య అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందనేందుకు నిదర్శనమని.. విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలలు ఆకర్షిస్తాయని NMC ప్రతినిధి వెల్లడించారు.