Indian Navy: 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్ (CLiC2NEWS): ఇండియన్ నేవీలో ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్) పోస్టుల భర్తీకి అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఫిబ్రవరి 2022 బ్యాచ్ లో మొత్తం 2500 పోస్టుల భర్తీకి గాను అభ్యర్థులు 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి, 01.02.2002 నుంచి 31.01.2005 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది 25.10-2021. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో నెలకు రూ.14600 చెల్లిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ ప్రకారం–రూ.21700–రూ.69100 అందిస్తారు. వివరాలకు www.joinindiannavy.gov.in/en వెబ్సైట్ చూడగలరు.