ఆర్‌కె బీచ్‌లో అట్టహాసంగా నేవీ డే సెలబ్రేషన్స్
విశాఖ (CLiC2NEWS): నేవీ డే సందర్భంగా విశాఖ సాగర తీరంలో భారత నౌకాదళ వాయువిభాగం సాహస విన్యాసాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. నేవి డే విన్యాసాలు తిలకించేందుకు నగరం నుండే కాక, దూర ప్రాంతాల నుండి కూడా సాగరతీరానికి ప్రజలు చేరుకున్నారు. యుద్ధ విమానాలు, నౌకలు,హెలికాప్టర్లు , ట్యాంకర్లు విన్యాసాలు చేశాయి. దాదాపు 8వేల అడుగుల ఎత్తు నుండి పారాచ్యూట్ సాయంతో జాతీయ జెండా,నేవీ జెండా ఎగురవేశారు.
విన్యాసాల్లో భాగంగా భారత నౌకాదళ పాటవం, పరాక్రమం ప్రదర్శించారు. ఉగ్రవాదుల నుండి బంధీలను రక్షించే క్రమంలో యుద్ద విన్యాసాలు, సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్లర్ల సాయంతో రక్షించే విధానం ప్రదర్శించిన తీరు, సముద్రంలో బంకర్ పేలుళ్ల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.