అమెరికాలో పిడుగుపాటుకు గురైన భారత విద్యార్థిని
హ్యూస్టన్ (CLiC2NEWS): యుఎస్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నీలజి మాస్టర్స్ చేస్తున్న భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురై మృత్యువుతో పోరాడుతుంది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ (యుహెచ్)లో ఉన్నత చదువుకోసం వచ్చిన విద్యార్థి సుశ్రూణ్య కోడూరు స్థానిక పార్కులో ఓ కొలను వద్ద ఉండగా పిడుగుపాటుకు గురైంది. వెంటనే ఆమె కొలనులో పడిపోయింది. ఆమెకు 20 నిమిషాలపాటు గుండె లయతప్పడంతో ఆమె మెదడు దెబ్బతిన్నట్లు.. ప్రస్తుతం ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘకాలం వైద్య చికిత్స అందించాల్సి ఉంటుందని ఆమె తరపు బంధువు సురేంద్రకుమార్ తెలిపారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయాన్నికోరుతూ ఆన్‌లైన్‌లో గోఫండ్‌మి ని ఏర్పాటు చేశారు.
[…] అమెరికాలో పిడుగుపాటుకు గురైన భారత వ… […]