ప్రజాస్వామ్య దేశాలకు భారత్ మార్గదర్శి: ప్రధాని మోడీ
ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని
న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శం.. ప్రజాస్వామ్య దేశాలకు భారత్ మార్గదర్శిగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోడీ ఎగుర వేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యమని ప్రధాని మోడీ అన్నారు. భానిస సంకెళ్ల ఛేదనలో మహానీయుల పోరాటం అనుపమానమని కొనియాడారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు మార్గదర్శనమని చెప్పారు.
“లక్ష్యాలను చేరుకుని భారత్ వేగంగా ముందడుగు వేస్తోంది… యువతలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలి.. ఎంతో మంది స్టార్టప్‌లతో ముందుకొస్తున్నారు. మన మూలాలు బలంగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగలం.. మహాత్ముని ఆశయాలకు.. భారతీయులందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నాం.. దేశ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రతి పౌరుడు సిద్దంగా ఉన్నాడు..“` అని ప్రధాని మోడీ అన్నారు.
“కేంద్ర, రాష్ట్రాలు ప్రజల ఆశల సాకారమే లక్ష్యంగా పని చేయాలి.. భారత ప్రజానీకం నవ చేతనతో ముందడుగు వేస్తోంది. ప్రపంచ దేశాల సరసన నిలబడేందుకు సమిష్టి కృషి చేయాలి“ అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.