ఉక్రెయిన్‌లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలలో భారతీయుల వెతలు..
ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశ ప్రజలతో పాటు ఆదేశంలో ఉన్న భారతీయులు సైతం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్నారు. అయితే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత్ అహర్నిశలు శ్రమిస్తోంది.ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు లేక పోవడంతో ఆదేశ సరిహద్దు దేశాల గూండా భారతీయులను తరలించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇప్పటికే భారతీయులను తీసుకొని తొలివిమానం ఇండియాకు బయలు దేరింది. ఇంకా ఎంతో మంది భారతీయులు అక్కడ చాలా ఇబ్బందులకు గురౌవుతున్నారు. తినడానికి, ఉండడానికి వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నీరుకూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్‌లోని భారతీయులు సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవాలని భారత్ ఎంబసీ తెలిపింది.ఈమేరకు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలలో విద్యార్థులు కొన్ని కిలోమీటర్లు కాలినడకన సరిహద్దు ప్రాంతాలకు వెళుతున్నారు. వీలైనంత త్వరగా మాకు సాయం చేయమని భారత్‌కు తీసుకెళ్లాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.