Olympics: మెన్స్ హాకీ సెమీస్‌లో భారత్ ఓటమి
హాకీ ఇండియా పసిడి ఆశలు ఆవిరి.. ఇకం కాంస్య పోరుకు సై

టోక్యో (CLiC2NEWS): ఒలింపిక్స్ లో పురుషుల హాకీలో భారత్ జట్టు సెమీస్‌లో ఓడింది. సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయింది. బెల్జియం చేతిలో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ నం.1 కఠిన ప్రత్యర్థి బెల్జియం చేతిలో 5-2 గోల్స్ తేడాతో భారత్ ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో ఓడిన ఇండియా .. రెండవ సెమీస్‌లో ఓడిన జట్టుతో బ్రాంజ్ మెడల్ కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. తొలి క్వార్టర్ లో ఇండియా పైచేయి సాధించింది. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెండ్రిక్స్ ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. 2వ, 3వ క్వార్టర్‌లో రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. చివరి క్వార్టర్‌లో మాత్రం బెల్జియం గట్టి పోటీని ఇచ్చి తన సత్తా చాటింది.
కాంస్య పతకం కోసం ఆగస్టు 5న భారత్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇవాళ సాయంత్రం ఆస్ట్రేలియా, జర్మనీ మద్య జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టుతో ఇండియా కాంస్య పకం కోసం పోటీపడుతుంది.