లార్డ్స్ లో భారత్‌ అద్భుత విజయం

లండన్‌ (CLiC2NEWS): మ్యాచ్‌ అంటే ఇది. అవును భారత్‌, ఇంగ్లండ్‌ రెండో టెస్టు చూసిన ప్రతి అభిమాని మదిలో మెలిగేది ఇది. ఆఖ‌రి రోజు అద‌ర‌గొట్టిన ఇండియా. లార్డ్స్‌లో జ‌రిగిన రెండో టెస్టులో 151 ప‌రుగుల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధింది 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కోహ్లీసేన నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లిష్‌ జట్టు 120 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్‌ రూట్‌(33)మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. మహహ్మద్‌ సిరాజ్‌(4/32) నాలుగు వికెట్లతో విజృంభించగా, బుమ్రా(3/33), ఇషాంత్‌శర్మ(2/13) రాణించారు. సెంచరీతో రాణించిన కేఎల్‌ రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇరు జట్ల మధ్య ఈనెల 25 నుంచి మూడో టెస్టు జరుగుతుంది.

సిరాజ్‌ సూప‌ర్ బౌలింగ్‌

లార్డ్స్ లో టీమిండియా విజ‌యంలో హైద‌రాబాదీ ఫేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌ది కీల‌క‌పాత్ర. తన బౌలింగ్‌ పదునేంటో మరోమారు ప్రత్యర్థికి రుచి చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ మరీ ఎక్కువ ఆధిక్యం సాధించ‌కుండా చూసిన సిరాజ్‌. రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లు తీసి అద్భుతం చేశాడు.

  • ఇండియా తొలి ఇన్నింగ్స్‌: 364 ఆలౌట్‌
  • ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 391 ఆలౌట్‌
  • ఇండియా రెండో ఇన్నింగ్స్‌:
    రాహుల్‌(సి)బట్లర్‌(బి)వుడ్‌ 5, రోహిత్‌(సి)అలీ(బి)వుడ్‌ 21, పుజార(సి)రూట్‌(బి)వుడ్‌ 45, కోహ్లీ(సి)బట్లర్‌(బి)కరాన్‌ 20, రహానే(సి)బట్లర్‌(బి)అలీ 61, పంత్‌(సి)బట్లర్‌(బి)రాబిన్సన్‌ 22, జడేజా(బి)అలీ 3, ఇషాంత్‌(ఎల్బీ)రాబిన్సన్‌ 16, షమీ 56 నాటౌట్‌, బుమ్రా 34 నాటౌట్‌;
  • ఎక్స్‌ట్రాలు: 15;
  • మొత్తం: 298/8 డిక్లేర్డ్‌
  • వికెట్ల పతనం: 1-18, 2-27, 3-55, 4-155, 5-167, 6-175, 7-194, 8-209; బౌలింగ్‌: అండర్సన్‌ 25.3-6-53-0, రాబిన్సన్‌ 17-6-45-2, వుడ్‌ 18-4-51-3, కరాన్‌ 18-3-42-1, అలీ 26-1-84-2, రూట్‌ 5-0-9-0.
  • ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌:
    బర్న్స్‌(సి)సిరాజ్‌(బి)బుమ్రా 0, సిబ్లే(సి)పంత్‌(బి)షమీ 0, హమీద్‌(ఎల్బీ)ఇషాంత్‌ 9, రూట్‌(సి)కోహ్లీ(బి)బుమ్రా 33, బెయిర్‌స్టో(ఎల్బీ)ఇషాంత్‌ 2, బట్లర్‌(సి)పంత్‌(బి)సిరాజ్‌ 25, అలీ(సి)కోహ్లీ(బి)సిరాజ్‌ 13, కరాన్‌(సి)పంత్‌(బి)సిరాజ్‌ 0, రాబిన్సన్‌ (ఎల్బీ)బుమ్రా 9, వుడ్‌ 0 నాటౌట్‌, అండర్సన్‌(బి)సిరాజ్‌ 0
  • ఎక్స్‌ట్రాలు: 29
  • మొత్తం: 120 ఆలౌట్‌
  • వికెట్ల పతనం: 1-1, 2-1, 3-44, 4-67, 5-67, 6-90, 7-90, 8-120, 9-120, 10-120; బౌలింగ్‌: బుమ్రా 15-3-33-3, షమీ 10-5-13-1, జడేజా 6-3-5-0, సిరాజ్‌ 10.5-3-30-4, ఇషాంత్‌ 10-3-13-2.
Leave A Reply

Your email address will not be published.