భార‌త ప్ర‌ధాని మోడికి ఫ్రాన్స్‌లో అత్యున్న‌త స‌త్కారం

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రెండు రోజుల ఫ్రాన్స్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మోడీని ఆ దేశ అత్యున్న‌త పౌర‌, సైనిక పుర‌స్కారంతో దేశాధ్యక్షుడు మేక్రాన్ స‌త్క‌రించారు. ఈ గౌర‌వాన్ని అందుకున్న మొద‌టి భార‌త ప్ర‌ధాని మోడీయే. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పుర‌స్కారాన్ని అందుకున్న వారిలో ద‌క్షిణాఫ్రికా మాజీ అధ్య‌క్షుడు నెల్స‌న్ మండేలా, బ్రిట‌న్ రాజు కింగ్ ఛార్లెస్‌, జ‌ర్మ‌నీ మాజీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్కెల్‌, ఐక్క‌రాజ్య‌స‌మితి మాజీ సెక్ర‌టీ జ‌న‌ర‌ల్ బుట్రోస్ ఘ‌లి వంటివారున్నారు. ఇప్పుడు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ అత్యున్న‌తమైన పుర‌స్కారాన్ని అందుకున్నారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఫ్రాన్స్ జాతీయ దినోత్స‌వ‌పు వేడుక‌ల‌లో పాల్గొనేందుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం పారిస్ చేరుకున్నారు. శుక్ర‌వారం ఫ్రాన్స్ నేష‌న‌ల్ డే సెల‌బ్రేష‌న్స్‌లో గౌర‌వ అతిథిగా పాల్గొంటారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. భార‌తీయుల విద్యార్థులు మాస్ట‌ర్స్ డిగ్రీ చేసేందుకు ఐదేళ్ల వీసాలు మంజూరు చేయ‌డానికి ఫ్రాన్స్ నిర్ణ‌యించింద‌ని వెల్ల‌డించారు. మార్సెల్లీలో నూత‌నంగా భాత‌ర కాన్సులేన్ ప్రారంభించిన‌ట్లు తెలిపారు. మోడీ నిన్న రాత్రి ప్రావాస భార‌తీయుల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఫ్రాన్స్ పుట్‌బాల్ ఆట‌గాడు ఎంబాపెపై ప్ర‌సంశ‌లు కురిపించాడు. అత‌నికి భార‌త్‌లో ఎక్కువ‌మంది ఫ్యాన్స్ ఉన్నార‌న్నారు.

ఫ్రాన్స్ జాతీయ దినోత్స‌వ‌పు వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా న‌రేంద్ర మోడి

Leave A Reply

Your email address will not be published.