IndiGo starts flight: హైదరాబాద్ టు కాన్పూర్ ప్రారంభం..

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నుంచి కాన్పూర్‌కు ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ – కాన్పూర్ మధ్య వారానికి ఆరు సార్లు ఇండిగో విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇండిగో విమానం (6E 269) బయల్దేరినట్లు అధికారులు తెలిపారు.
అలాగు కాన్పూర్ నుంచి కూడా 6E 102 విమానం బయల్దేరి హైదరాబాద్‌కు సాయంత్రం 4:35 గంటలకు చేరుకొంది.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి దేశంలోని టైర్ 2 పట్టణాలకు విమాన సర్వీసులను విస్తరిస్తామని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సిఇఒ ప్రదీప్ పానికర్ తెలిపారు.