విడతల వారీగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి

ఎల్కతుర్తి (CLiC2NEWS): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భూభారతి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్,పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భూభారతి చట్టాన్ని తయారు చేసిందని.. రైతులను ఇబ్బంది పెట్టకుండా సక్రమంగా అమలు చేసే బాధ్యత అధికారులదేనన్నారు. ప్రతి అధికారి కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన వారేనని.. రైతుల కష్టాలు తెలుసు కాబట్టి వారిని ఇబ్బందులకు గురికాకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. తొలి విడతలో అత్యంత పేదవారికి ప్రాధాన్యత ఇస్తున్నామని.. విడతల వారిగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.