ప్రతి నియోజక వర్గానికి 3,500 నుండి 4వేల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొగులేటి

హైదరాబాద్ రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మా ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజక వర్గానికి 3,500 నుండి 4 వేల గృహాలు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు.