మొయినాబాద్: నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కూలి ఇద్దరు మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో నిర్మాణంలో ఉన్న స్టేడియం కూలి ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. మొయినాబాద్ మండలం కనకమామిడిలో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సోమవారం 14 మంది కూలీలు అక్కడ పనిచేస్తుండగా.. ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్టేడియం ఓ టేబల్ టెన్నిస్ అకాడమీకి చెందినట్లు గా సమాచారం.