INDW vs BANW: కీలక మ్యాచ్‌లో భారత్ భారీ విజయం
మూడో స్థానంలో టీమ్ ఇండియా
మహిళల ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా బంగ్లాదేశ్‌పై 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో భారీ విజయం సాధించి భారత్ (6) మూడో స్థానంలో నిలిచింది. ఆసీస్ (12) మొదటి స్థానం, దక్షిణాఫ్రికా (8) రెండవ స్థానంలో ఉన్నాయి. భారత్ (6), వెస్టెండీస్ (6) పాయింట్లతో ఉన్నాయి.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 119 పరుగులకే ఆలౌటయింది.