మహిళల టి20 ప్రపంచకప్.. ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం

దుబాయి (CLiC2NEWS): మహిళల టి 20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా జట్టు పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చూసిన హర్మన్‌ప్రీత్ ..సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయంతో బోణీకొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిర పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అక్టోబర్ 9వ తేదీన శ్రీలంకతో టీమ్ ఇండియా తలపడనుంది.