INDW vs WIW World Cup: వెస్టిండీస్ ముందు భారీ ల‌క్ష్యం

హామిల్ట‌న్ (CLiC2NEWS): ఐసిసి మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ ఇండియా 50 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి 8 వికెట్ల న‌ష్టానికి 317 ప‌రుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భార‌త్ బ్యాట‌ర్ల‌లో స్మృతి మంధాన (123), హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (109) శ‌త‌కాల‌తో రాణించారు. యాస్తికా భాటియా (31), కెప్టెన్ మిథాలీరాజ్ (5), దీప్తి శ‌ర్మ (15) ప‌రుగులు చేశారు. భార‌త్ 78 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డినా స్మృతి, హ‌ర్మ‌న్ కీల‌క భాగ‌స్వామ్యంతో జ‌ట్టును ఫామ్‌లోకి తెచ్చారు. విండీస్ ముందు 318 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

Leave A Reply

Your email address will not be published.