వాసాలమర్రిలో సర్కార్ భూముల పరిశీలన
Inspection of Government Lands at Vasalamarri
వాసాలమర్రి (CLiC2NEWS): తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ప్రభుత్వ భూములను జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, ఆర్డీవో భూపాల్‌రెడ్డి పరిశీలించారు. వాసాలమర్రి గ్రామం.. గ్రామ శివారులలో సర్కార్ భూములను గుర్తించేందుకు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్, ఆర్‌ఐ జహంగీర్, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇక్కడ నిర్వహించిన సర్వేలో ఎంత ప్రభుత్వ భూమి ప్రజల ఆధీనంలో ఉంది. మిగులు భూమి ఎంత ఉంది.. అని సర్వే నిర్వహించారు. సర్వే నివేదికను సర్కార్‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు.