సిబిఎస్ఇ పాఠ‌శాల‌ల్లో త‌నిఖీలు..

ఢిల్లీ (CLiC2NEWS) : దేశంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ప‌లు పాఠ‌శాల‌ల్లో సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సిబిఎస్ఇ) ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టింది. ఈ జాబితాలో ఒక ఢిల్లీలోనే 18 పాఠ‌శాల‌లు ఉండ‌గా.. వార‌ణాసిలో మూడు, బెంగ‌ళూరు, ప‌ట్నా, ఆహ్మ‌దాబాద్, బిలాస్పూర్‌ల‌లో రెండు చొప్పున ఉన్నాయి. డ‌మ్మీ విద్యార్థుల న‌మోదును ప‌రిశీలించేందుకు బుధ‌, గురు వారాల్లో సిబిఎస్‌సి త‌నిఖీలు నిర్వ‌హించింది. అనేక పాఠ‌శాల‌ల్లో వాస్త‌విక హాజ‌రు రికార్డుల‌కు మించి విద్యార్థ‌లను ఎన్‌రోల్ చేయ‌డం ద్వారా బోర్డు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్న‌ట్లు గుర్తించారు. ఆయా పాఠ‌శాల‌ల‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్ వంటి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌య్యే అనేక‌మంది విద్యార్థుల‌ను డ‌మ్మీ పాఠ‌శాల‌ల వైపు ఆస‌క్తి చూపుతుంటారు. రెగ్యుల‌ర్‌గా త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకాకుండా కేవ‌లం ప‌రీక్ష‌ల‌కే హ‌జ‌రై త‌మ దృష్టంతా పోటీ ప‌రీక్ష‌ల‌పైనే పెట్టేలా ఈ పాఠ‌శాల‌లు విద్యార్థుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తుంటారు. వాటిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే అంశాన్ని సైతం ప‌రిశీలిస్తున్న‌ట్లు సిబిఎస్ఇ కార్య‌ద‌ర్శి హిమాన్షు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.