ఫిబ్రవరి 28 నుండి ఇంటర్ పరీక్షలు..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలోనే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గురువారం పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 1 వ తేదీ నుండి 15 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రాక్టికల్స్ శనివారం, ఆదివారాల్లో కూడా నిర్వహిస్తారని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.