AP: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు యథాతథం
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ద్వితీయ ఏడాదికి మాత్రమే పబ్లిక్ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని.. మొదటి ఏడాదికి ఆయా విద్యా సంస్థలు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చు వంటి ప్రతిపాదనలు ఇటీవల చేసిన సంగతి తెలిసిందే.
జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం వంటి విధానం వంటి ప్రతిపాదనలుపై ఈ నెల 26 వరకు పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టరని, అభ్యసన సామర్ధ్యాలు తగ్గిపోతాయనే పలు సూచనలు వచ్చాయి. ఈ సూచనల మేరకు మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది.
ఎన్‌సిఇఆర్‌టి సిలబస్ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గణితంలో ఎ,బి పేపర్లు ఉండకుండా ఒకటే పేపర్‌గా ఇస్తారు. వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్ ఉండనుంది. రెండు భాష సబ్జెక్టుల్లో ఆంగ్లం తప్పనిసరిగి ఉంటుంది. మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఇచ్చికంగా ఎంపిక చేసుకోవడం ఉంటుంది. వీటిపై త్వరలో ఇంటర్మీడియట్ విద్యా మండలి సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయనున్నట్లు సమాచారం.