రేపటి నుండి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మార్చి 23వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,882 కళాశాలల్లో జరగనున్న ఈ పరీక్షలకు సుమారు 3.52 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బైపిసి గ్రూపు విద్యార్థులు 1.01 లక్షలు, ఎంపిసి గ్రూపు విద్యార్థులు 1.56 లక్షల మంది ఉన్నారు. మిగిలిన వారు ఒకేషనల్, జాగ్రఫీ విద్యార్థులు ఉన్నారు.