రేపు ఇంటర్ ఫలితాలు విడుదల..
హైదరాబాద్ (CLiC2NEWS): రేపు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలకానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు నాంపల్లి బోర్డ్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు బోర్డ్ అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.