గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఇంటర్ విద్యార్థి
ఖమ్మం (CLiC2NEWS): చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా యువకులు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చాలా మంది మృతి చెందిన ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుండెపోటుకు గురైన వ్యక్తులు గంట వ్యవధిలోనే మృత్యువాతపడుతున్నారు. అప్పటిదాకా స్నేహితులతో మాట్లాడుతూ ఉన్న ఇంటర్ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలో ఓ ప్రైవేటు కాలేజ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇంటి వద్దనే తన మిత్రులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతనిని వెంటనే మధిరలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.