ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
హైదరాబాద్ (CLiC2NEWS): అంబర్‌పేట ప్రైవేటు కాలేజీలో విద్యార్థి టిసి గురించి మాట్లాడేందుకు ప్రిన్సిపాల్ గదికి వెళ్లిన విద్యార్థి నాయకుడు. పెట్రోల్ పోసుకొన్నాడు. ఆ గదిలో దీపం ఉండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపాల్‌తో పాటు అక్కడ ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ప్రిన్సిపాల్ టిసి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం వలన విద్యార్థి ఈ ఘటనకు పాల్పడ్డాడని అతడి స్నేహితులు చెబుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఆ బాధ్యత ప్రిన్సిపాల్‌దేనని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డిఐఇఓ, ఇంటర్ బోర్డ్‌కు ఫిర్యాదు చేయవచ్చాన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.