ఐడిబిఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంపు
IDBI Bank: ప్రభుత్వ రంగానికి చెందిన ఐడిబిఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను పెంచుకునేందుకు పరిమిత కాలపు ఆఫర్ కింద వడ్డీ రేటును పెంచింది. ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కింద అందిస్తున్న ప్రత్యేక కాల వ్యవధుల డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఐడిబిఐ అందిస్తోంది. పెరిగిన వడ్డీ రేట్లు వచ్చేనెల 30లోపు అమలులోకి రానున్నట్లు సమాచారం.
బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుతుండడం పట్ల ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేశారు. వీరు డిపాజిట్లు మెరుగుపరుచుకోవాలని సూచించారు. మరుసటి రోజే ఐడిబిఐ నుండి ఈ నిర్ణయం వెలువడింది.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల కాలవ్యవధి. . వడ్డీ రేటు
444 రోజుల కాల వ్యవధిపై 7.85%
375 రోజులు————– 7.75%
700 రోజులు ————- 7.70%
300 రోజులు ————- 7.55%