ఎపిలో రేపు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో రేపు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈమేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు వెల్లడించారు. రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగినవి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తం 9,20,552 మంది కాగా.. ఒకేషనల్ విద్యార్థులు 83,749 మంది పరీక్షలకు హాజరయ్యారు.