ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
అమరావతి (CLiC2NEWS): ఇంటర్మీడియట్ ఎక్జామ్స్ షెడ్యూల్‌ను ఎపి ఇంటర్‌బోర్డ్ ప్రకటించింది. వార్షిక పరీక్షలను మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 15న ఇంటర్ ప్రథమ సంవత్సరం.. మార్చి 16 నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీన ఎతిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, ఫిబ్రవరి 24వ తేదీన పర్యావరణ పరీక్ష నిర్హహించనున్నారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 15 నుండి 25వరకు ప్రాక్టికల్ ఎక్జామ్స్ జరుగుతాయని ఇంటర్ బోర్డ్ అధికారులు వివరించారు.