International: పలుదేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అగ్రరాజ్యం
సుమారు 50 దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఆంక్షల నుండి వెసులుబాటు

వాషింగ్టన్ (CLiC2NEWS): భారత్ సహా పలుదేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ, కొన్ని కొత్త నిబంధనలను అమెరికా
అమల్లోకి తెచ్చింది. ఇవి నవంబరు 8 వ తీదీనుండి అమలులోకి రానున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది.
అదేవిధంగా వ్యాక్సినేషన్ గురించి విమానయాన సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను పేర్కొంది. ప్రయాణికులనుంచి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలని, సిడిసి కాంటాక్ట్ ట్రేసింగ్ సంబంధించి విమానయాన సంస్థలకు నిబంధనలు జారీ చేసింది.
కొవిడ్ కారణంగా గత ఏడాది విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసినదే. ` అమెరికా ప్రయేజనాల రృష్ట్యా కొవిడ్ వలన విదించిన ఆంక్షల్ని తొలగిస్తున్నాం. టీకా ఆధారిత అంతర్జాతీయ విమాన ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం` అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు. వాక్సినేషన్ రేటు 10% కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించనుంది. వీరు అమెరికాకు వచ్చిన 60 రోజులలోపు వాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి. ప్రయాణం ప్రారంభమైన 72 గంటలలోపు చేయించుకున్న ఆర్టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ రెపోర్ట్‌ను అందించాలి.