ఇంట‌ర్నేష‌న‌ల్ ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ప్ర‌పంచ ఖ్యాతి పొందాలి: సిజెఐ ఎన్‌వి ర‌మ‌ణ‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): అంత‌ర్జాతీయ ఆర్బిట్ర‌ష‌న్ సెంట‌ర్ (ఐఎఎంసి) వ‌ల్ల హైద‌రాబాద్‌కు మ‌రింత పేరొస్తుంద‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌వి ర‌మ‌ణ అన్నారు. హైద‌రాబాద్‌ హైటెక్స్‌లోని ఐకియా వెనుక 3.7 ఎక‌రాల్లో ఐఎఎంసి శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణానికి ఆయ‌న భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్.వి. ర‌మ‌ణ మాట్లాడుతూ.. ఇప్ప‌టికే హైద‌రాబాద్ అంత‌ర్జాతీయ ఆర్బిట్ర‌ష‌న్ సెంట‌ర్ కొన‌సాగుతుంది. గ‌చ్చిబౌలిలో విలువైన భూమిని కేటాయించినందుకు ముఖ్య‌మంత్రి కెసిఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఐఎఎంసి వ‌ల్ల హైద‌రాబాద్‌కు మ‌రింత పేరొస్తుంద‌ని, సింగ‌పూర్‌లో హైద‌రాబాద్ కూడా ప్ర‌పంచ ఖ్యాతి పొందాల‌ని అన్నారు. వ‌చ్చే ఏడాది ఈ స‌మ‌యానికి నిర్మాణ పూర్తి కావాల‌ని ఆశిస్తున్నాన‌ని సిజెఐ అన్నారు.

ఈ కార్యక్ర‌మంలో ట్ర‌స్ట్ స‌భ్యులు, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ ఎల్‌. నాగేశ్వ‌ర‌రావు, జ‌స్టిస్ హిమాకోహ్లి, మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆర్వీ ర‌వీంద్ర‌న్‌, హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ, రాష్ట్ర మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మ‌హ‌మూద్ అలీ, కెటిఆర్‌, స‌బితా ఇంద్రారెడ్డి, శ్రీ‌నివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.