ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

ఢిల్లి (CLiC2NEWS): అంతర్జాతీయ ముఠాను ఢిల్లీ స్పెషల్ సెల్ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కారులో పది కేజీల హెరాయిన్‌ను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వీరు స్వాధీనం చేసుకన్న హెరాయిన్ విలువ సుమారు రూ. 40 కోట్లు ఉంటుంది. మయన్మార్ నుండి మణిపూర్ మీదుగా భారత్‌కి తీసుకొచ్చినట్లు గుర్తించారు. నిందితులపై ఎన్డిపిఎస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.