ద‌క్షిణ గాజాను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయిల్ హెచ్చ‌రిక‌లు..

జెరూస‌లెం (CLiC2NEWS): ద‌క్షిణ గాజాపై దాడుల‌కు సిద్ధ‌మైన ఇజ్రాయిల్.. ఆ ప్రాంత‌వాసుల‌ను ఖాళీ చేయాల‌ని ఆదేశాలిచ్చింది.
ద‌క్షిణ గాజా నుండి త‌క్ష‌ణ‌మే వెళ్లిపోండని పాల‌స్తీనీయుల‌కు ఇజ్రాయిల్ సైన్యం తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇప్ప‌టికే ఆప్రంతంపై ఐజ్రాయెల్ దాడి చేసిన‌ట్లు స‌మాచారం. ఆ ప్రాంతంలో 4 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌నాభా ఉంటారు. వీరంతా సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్ల‌డం అంత సులువైన‌ప‌ని కాద‌ని, కాక‌పోతే, ఎదుకాల్పుల్లో సామాన్య పౌరులు బ‌ల‌వ‌కూడ‌ద‌ని భావిస్తున్నామ‌ని ఇజ్రాయెల్ అధికారి తెలిపిన‌ట్లు అక్క‌డి మీడియా వెల్ల‌డించింది.

హ‌మాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులలో అనేక‌మంది సామాన్య ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవ‌ల ఉత్త‌ర గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేసిన‌పుడు అక్క‌డి వారంతా ద‌క్షిణ గాజాకు చేర‌కున్నారు. తాజా హెచ్చ‌రిక‌ల‌తో మ‌ళ్లీ వారంతా ప‌శ్చిమానికి వెళ్లాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో మ‌ళ్లీ వ‌ల‌స‌బాట ప‌ట్ట‌క తప్ప‌ద‌ని పాల‌స్తీనీయులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.