23న నగరంలోని పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో సోమవారం పలుప్రాంతాలకు మంచినీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు జలమండలి ప్రకటనలో తెలిపింది. తాగునీరు సరఫరా చేసే కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్-1 పరిధిలోని ప్రశాసన్ నగర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్ కు పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టేందుకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ పనులు సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 6 గంటల వరకు జరగనున్నాయి. కాబట్టి ఈ 24 గంటలు కింద పేర్కొన్న రిజర్వాయర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
హకీంపేట్, గోల్కొండ, టోలిచౌకి, లంగర్ హౌజ్, షేక్ పేట్.
జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, తట్టిఖానా, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్, గచ్చిబౌలి.