ఈనెల 16, 17 తేదీల‌లో హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైదరాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లుగుతుంద‌ని జ‌ల‌మండ‌ల అధికారులు తెలిపారు. మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ – 1కి సంబంధించి మిరాలం ఆలియాబాద్ ఆఫ్‌టేక్ వ‌ద్ద 1200 ఎంఎం డ‌యా ఎంఎస్ గ్రావిటీ మెయిన్‌కు జంక్ష‌న్ ప‌నులు జ‌ర‌పాల్సి ఉంది. ఎస్ఆర్‌డీపీలో భాగంగా ఫ‌ల‌క్‌నుమాలోని అల్‌జుబైల్ కాలనీ వ‌ద్ద‌ జ‌రుగుతున్న ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి ఆటంకం క‌ల‌గ‌కుండా ఈ ప‌నులు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నెల 16వ తేది మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంటల నుండి 17 వ తేది సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 36 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 1 కింద ఉన్న రిజర్వాయర్ల ప‌రిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 1 – మిరాలం, కిష‌న్‌బాగ్‌, అల్ జుబైల్ కాల‌నీ రిజ‌ర్వాయ‌ర్ల‌ ప‌రిధిలోని ప్రాంతాలు.

2. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 2ఏ – సంతోష్‌న‌గ‌ర్‌, విన‌య్ న‌గ‌ర్‌, సైదాబాద్‌, చంచ‌ల్‌గూడ‌, అస్మాన్‌గ‌ఢ్‌, యాకూత్‌పురా, మాద‌న్న‌పేట‌, మ‌హ‌బూబ్ మాన్ష‌న్ రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిధిలోని ప్రాంతాలు.

3. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 2బీ – రియాస‌త్‌న‌గ‌ర్‌, ఆలియాబాద్, బాలాపూర్‌ రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిధిలోని ప్రాంతాలు.

4. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 4 – బొగ్గుల‌కుంట‌, అప్జ‌ల్‌గంజ్ రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిధిలోని ప్రాంతాలు.

5. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 5 – నారాయ‌ణ‌గూడ‌, అడిక్‌మెట్‌, శివం, న‌ల్ల‌కుంట‌, చిల‌కల‌గూడ రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిధిలోని ప్రాంతాలు.

6. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 10ఏ – దిల్‌సుఖ్‌న‌గ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌ ప‌రిధిలోని ప్రాంతాలు.

7. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 20 – బొంగుళూరు రిజ‌ర్వాయ‌ర్‌ ప‌రిధిలోని ప్రాంతాలు.

8. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 25 – మ‌న్నెగూడ రిజ‌ర్వాయ‌ర్‌ ప‌రిధిలోని ప్రాంతాలు.

 

దీంతో పాటు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ – 2, 3కి సంబంధించి గొడ‌కొండ్ల 132 కేవీ స‌బ్‌స్టేష‌న్‌లోని ట్రాన్స్‌ఫార్మార్ల‌ను టీఎస్‌ట్రాన్స్‌కో మార్చ‌నుంది. ఈ నెల 16వ తేది  ఉద‌యం 10 గంటల నుండి మ‌ధ్యాహ్నం 1 గంట‌ వ‌ర‌కు మొత్తం 3 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 3 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 2, 3 కింద ఉన్న రిజర్వాయర్ల ప‌రిధిలో నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బాలాపూర్‌, మైసారం, బార్కాస్‌, శాస్త్రిపురం, బండ్ల‌గూడ‌.

2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 3 – మెహ‌దీప‌ట్నం, కార్వాన్‌, లంగ‌ర్‌హౌజ్‌, కాక‌తీయ‌న‌గ‌ర్‌, హుమాయున్ న‌గ‌ర్‌, తాళ్ల‌గ‌డ్డ, ఆసిఫ్‌న‌గ‌ర్‌, ఎంఈఎస్‌, షేక్‌పేట్‌, ఓయూ కాల‌నీ, టోలిచౌకి, మ‌ల్లేప‌ల్లి, విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీ, భోజ‌గూట్ట‌, చింత‌ల్‌బ‌స్తీ.

3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 4 – జియాగూడ‌, రెడ్ హిల్స్‌, సెక్ర‌టేరియ‌ట్‌, ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్ట‌ర్స్‌, అల్లాబండ‌.

4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5 – గ‌గ‌న్‌మ‌హాల్‌, హిమాయ‌త్‌న‌గ‌ర్‌, మేక‌ల‌మండి, భోల‌క్‌పూర్‌.

5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6 – జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌న‌గ‌ర్‌, ప్ర‌శాస‌న్ న‌గ‌ర్‌, త‌ట్టిఖానా.

6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 7 – తార్నాక‌, లాలాపేట‌, బౌద్ధ‌న‌గ‌ర్‌, మారేడ్‌ప‌ల్లి, కంట్రోల్ రూమ్‌, రైల్వేస్‌, ఎంఈఎస్‌, కంటోన్మెంట్‌, ప్ర‌కాశ్ న‌గ‌ర్‌, పాటిగ‌డ్డ‌.

7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9 – హ‌స్మ‌త్‌పేట్‌, ఫిరోజ్‌గూడ‌, గౌత‌మ్‌న‌గ‌ర్‌.

8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – సాహేబ్‌న‌గ‌ర్‌, వైశాలిన‌గ‌ర్‌, బీఎన్ రెడ్డి న‌గ‌ర్‌, వ‌న‌స్థ‌లిపురం, ఆటోన‌గ‌ర్‌, మారుతిన‌గ‌ర్‌.

9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – మ‌హేంద్ర‌హిల్స్‌, సైనిక్‌పురి, మౌలాలి.

10. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – వెలుగుగుట్ట‌, రామంతాపూర్‌, ఉప్ప‌ల్‌, నాచారం, హ‌బ్సిగూడ‌, చిలుకాన‌గ‌ర్‌, బీర‌ప్ప‌గ‌డ్డ‌, స్నేహ‌పురి, కైలాస్‌గిరి, దేవేంద్ర‌న‌గ‌ర్‌.

11. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 15 – గ‌చ్చిబౌలి, మాధాపూర్‌, అయ్య‌ప్ప సొసైటీ, కావూరీ హిల్స్‌.

12. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 16 – మ‌ధుబ‌న్‌, దుర్గాన‌గ‌ర్‌, బుద్వేల్‌, సులేమాన్ న‌గ‌ర్‌, గోల్డెన్ హైట్స్‌, నైన్ నెంబ‌ర్, హైద‌ర్‌గూడ‌, రాజేంద్ర‌న‌గ‌ర్, ఉప్ప‌ర్‌ప‌ల్లి, ఎంఎం ప‌హాడీ, చింత‌ల్‌

 

Leave A Reply

Your email address will not be published.