దశాబ్ది ఉత్సవాలకు రావాలని కెసిఆర్‌కు ఆహ్వానం..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర అవతరణ దినోత్సవపు వేడుకలకు రావాలని మాజి సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసి కెసిఆర్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ , డైరెక్టర్ అరవింద్ సింగ్‌లు సిఎం సూచన మేరకు ఆహ్వానలేఖ, పత్రిక తీసుకొని ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరుకానున్నారన్న విషయం తెలిసిందే. ఇటీవల రేవంత్ రెడ్డి సోనీయా గాంధీని నేరుగా కలుసుకొని ఆహ్వానించారు.