Ayodhya: జనవరి 22న రామమందిరంలో దేవతామూర్తుల ప్రతిష్ట..
ఆయోధ్య (CLiC2NEWS): 2024 జనవరి 22న ఆయోధ్య రామమందిరంలో దేవతామూర్తుల ప్రతిష్టించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ తెలిపింది. ఈ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు ట్రస్ట్ ప్రకటనలో పేర్కొంది.
ట్రస్ట్ సభ్యులు ప్రధానమంత్రి మోడీని రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి రామ మందిరంలో మొదటి అంతస్తు పూర్తివుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయ్యాయిని వెల్లడించారు. రామ మందిరంలోని గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉన్న పాలరాతి సింహాసనంపూ ఏర్పాటు చేయనున్నట్లు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. ఈ సింహాసనం డిసెంబర్ 15 నాటికి అయోధ్యకు చేరుకుంటుందని.. దీనికి రాజస్థాన్‌లో శిల్పకారులు తుది మెరుగులు దిద్దతున్నారని వెల్లడించారు.