ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. డేవిడ్ వార్న్‌కు జరిమానా
IPL (CLiC2NEWS) : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్న్‌కు ఐపిఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు గాను డేవిడ్ వార్న్‌కు ఐపిఎల్ 12 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. ఇదే తప్పు రెండో సారి జరిగితే ఒక్క మ్యాచ్ నిషేధం పడుతుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్లో ఓవరేట్ కారణంగా అతనికి జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్లో వార్నర్ కంటే ముందు జరిమానా ఎదుర్కొన్న వారి జాబితాలో వరుసగా ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సిబి, సంజూ శాంసన్ రాజస్తాన్, సూర్యకుమార్ యాదవ్ ముంబై, హార్దిక్ పాండ్యా గుజరాత్, కెఎల్ రాహుల్ లక్నో, విరాట్ కోహ్లీ ఆర్సిబి ఉన్నారు.