GT vs CSK: 83 పరుగుల తేడాతో గుజరాత్‌పై చెన్నై విజయం

IPL: అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ 147 పరుగులకే ఆలౌటయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే 52, ఉర్విల్ పటేల్ 37, మాత్రే 34, డెవాల్డ్ బ్రెవిస్ 57 , రవీంద్ర జడేజా 21* పరుగులతో రాణించారు.
అనంతరం 231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 18.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటయింది. సుదర్శన్ 41, గిల్ 13, షారూఖ్ 19, అర్హద్ 20, రాహుల్ తెవాతియా 14 రషీద్ 12 పరుగుల చేశారు.