IPL: సన్‌రైజర్స్ లక్ష్యం 201

కోల్‌కతా (CLiC2NEWS): ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యార్ 25 బంతుల్లో అర్ధశతకం చేశాడు. రఘవంశీ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 35 బంతుల్లో ఆర్ధ శతకం బాదాడు. 201 పరుగుల లక్ష్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది.