IPL Season 17: కోల్కతా విజయం
చెన్నై (CLiC2NEWS): ఐపిఎల్ 17 వ సీజన్లో కోల్కతా 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి కోల్కతా మూడోసారి ఐపిఎల్ విజేతగా నిలిచింది. కోల్కతా, హైదరాబాద్ మధ్య ఫైనల్ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. 114 లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా … 10 ఓవర్లలో ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబా్ 113 పరుగులకే ఆలౌటయింది. కోల్కతా బ్యాటర్స్ వెంకటేశ్ అయ్యర్ అర్ధశతకం చేశాడు.