IPL: లఖ్‌నవూపై ఆర్సిబి విజయం
LSG vs RCB : లఖ్‌నవూపై ఆర్సిబి విజయం సాధించింది. ఐపిఎల్ లో ఈ రోజుతో లీగ్ దశ ముగుస్తుంది. లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ లఖ్‌నవూ జట్టు పై విజయం సాధించింది. ఈ విజయంతో క్వాలిఫయర్ 1కు ఆర్సిబి అర్హత సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు సాధించింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబి 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ 54, ఫిల్ 30 , మాయాంక్41*, జితేశ్ శర్మ85* పరుగులతో జట్టు విజయానికి కారణమయ్యారు.
లఖ్‌నవూ ఛాలెంజర్స్‌లో రిషబ్ పంత్ 118 పరుగులతో లఖ్‌నవూ జట్టు ఆర్సిబి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.