IPL: రేపు ప్లేఆఫ్స్ తొలిపోరు.. సన్‌రైజర్స్ vs నైట్‌రైడర్స్

IPL Season 17 : ఐపిఎల్ 17వ సీజన్‌లో రేపు ఫైనల్‌కు క్వాలిఫయర్-1 పోరు జరగనుంది. హైదరాబాద్ సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మధ్య జరగనుంది. రేపు అహ్మదాబాద్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈమ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు వెళుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
KKR: ఐపిఎల్ లీగ్ స్టేజ్ దాటుకుని నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాయి. 20 పాయింట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి స్థానంలో నిలిచింది. కోల్‌కతా మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడగా 9 విజయాలు సాధించింది.
SRH: హైదరాబాద్ సన్‌రైజర్స్ ఈ ఏడాది రికార్డులు సాధించింది. గత మూడుసీజన్లలో లీగ్ స్టేజ్‌కే పరితమైంది సన్‌రైజర్స్ జట్టు. కానీ ఈ సీజన్‌లో పలు రికార్డులు సొంతం చేసుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో రెండో స్థానం దక్కించుకుంది. 14 లీగ్ మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించి 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు 287, 277 సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అహ్మదాబాద్ పిచ్ కూడా ఇలాంటి స్కోర్ నమోదు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
RR: తొలి 9 మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలు సాధించిన రాజస్థాన్‌కు అగ్రస్థానం పక్కా అనుకుంటే.. చివరి ఐదు మ్యాచ్‌లలో నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి మూడో స్థానంలో ఉంది.
RCB: బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు. చైన్నై 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుతుందనకున్న సమయంలో బెంగళూరుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అనూహ్యంగా 12 పాయింట్లతో ఉన్న ఆర్‌సిబి చైన్నైని ఓడించి ప్లేఆఫ్స్‌కు చేరింది. మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లలో ఆరు విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది.
ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లు ఎరితో ఎపుడు తలపడనున్నాయంటే..
మే 21 అహ్మదాబాద్ వేదికగా.. కోలకతా నైట్ రైడర్స్ X హైదరాబాద్ (క్వాలిఫయర్-1)
మే 22 అహ్మదాబాద్ వేదికగా బెంగళూరు X రాజస్థాన్ (ఎలిమినేటర్)
మే24 తొలి క్వాలిఫయర్లో ఓడిన జట్టు X ఎలిమినేటర్ విజేత
ఫైనల్:
మే 26 తొలి క్వాలిఫయర్ -1 విజేత X క్వాలిఫయర్ – 2 విజేత
[…] IPL: రేపు ప్లేఆఫ్స్ తొలిపోరు.. సన్‌రైజ… […]