110 పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు
168 పరుగులకు నైట్ రైడర్స్ ఆలౌట్

IPL: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు విజయం సాధించింది. 110 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లకు 168 పరుగులు చేసి ఆలౌటయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఐపిఎల్ సీజన్ లో తమ ఆఖరి మ్యాచ్‌ని భారీ విజయంతో ముగించింది. ప్లే ఆప్స్ నుండి నిష్రమించిన తరువాత వరుసగా మూడో విజయంతో సూపర్ విక్టరీ సాధించింది.
హెడ్ 28 బంతుల్లో అర్ధశతకం సాధించగా.. క్లాసెస్ 38 బంతుల్లో సెంచరీ బాదాడు. హెన్రిచ్ క్లాసెస్ 105* పరుగులు (6 ఫోర్లు, 9 సిక్స్‌లు) సాధించాడు. ట్రావిస్ హెడ్ 76 పరుగులు చేయగా.. 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో చెలరేగారు.