ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ పంజాబ్‌పై విజయం ..
ఉప్పల్ (CLiC2NEWS): ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్‌తో తలపడుతున్న సంగతి తెలిసిందే. 4 వికెట్ల తేడాతో పంజాబ్‌పై హైదరాబాద్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. చివరిలీగ్ మ్యాచ్‌లో 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఘన విజయం సాధించారు. 19.1 ఓవర్లలో అభిషేక్ శర్మ 66, రాహుల్ త్రిపాఠి 33, నితీశ్ రెడ్డి 37, క్లాసెస్ 42 పరుగులు చేశారు.