అతిపిన్న‌ వ‌య‌సులో ఐపిఎల్ అరంగేట్రం..  రికార్డు సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ

Vaibhav Suryavanshi: అతి చిన్న వ‌య‌స్సులో ఐపిఎల్ అరంగేట్రం చేసిన ఆట‌గాడిగా వైభ‌వ్ సూర్య‌వంశీ చ‌రిత్ర సృష్టించాడు. 14 ఏళ్లు 23 రోజుల టీనేజ్ క్రికెట‌ర్ వైభ‌వ్‌.. ఐపిఎల్ 2025లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈ జ‌ట్టు ల‌ఖ్‌న‌వు సూప‌ర్ జెయింట్స్‌తో త‌ల‌ప‌డుతున్న మ్యాచ్‌లో వైభ‌వ్ అరంగేట్రం చేశాడు. బిహార్‌కు చెందిన వైభ‌వ్‌.. గ‌తేడాది మెగా వేలంగో రూ.1.10కోట్ల ధ‌ర ప‌లికాడు. వేలంలో అమ్ముడు పోయిన అతిపిన్న వ‌య‌సు ఆట‌గాడిగా వైభ‌వ్ .. ప్ర‌యాస్ రే బ‌ర్మ‌న్ (16 ఏళ్ల 157 రోజులు)  పేరు మీద‌న్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

 

ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీ ప‌డి మ‌రీ..  రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వైభ‌వ్‌ను ద‌క్కించుకుంది. తుది జ‌ట్టులో  చోటు ద‌క్క‌క‌పోయినా ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు. ఎదుర్కున్న తొలి బంతినే సిక్స్‌గా మ‌లిచాడు. మొత్తం 20 బంతుల్లో 2 ఫోర్లు.. 3 సిక్స్‌లు బాది, 34 ప‌రుగులు చేశాడు.

Leave A Reply

Your email address will not be published.