Hyderabad to Tirupathi: విమానప్రయాణంతో పాటు శ్రీవారి దర్శనం
హైదరాబాద్ (CLiC2NEWS): కేవలం రెండు రోజుల్లో తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణమయ్యే విధంగా ఐఆర్‌సిటిసి సరికొత్త టూర్ ప్యాకేజిని తెచ్చింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సిటిసి) ‘తిరుపతి బాలాజీ దర్శనం’ అనే పేరుతో తిరుమల శ్రీవారి దర్శించుకొనే ఏర్పాటు చేసింది. తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలను కూడా సంర్శించవచ్చు. దీంట్లో స్వామివారి దర్శన టికెట్లు అవసరం లేదు. రానూ పోనూ విమాన ప్రయాణము కావున రెండు రోజుల్లో యాత్ర ముంగించుకొని హైదరాబాద్ చేరుకోవచ్చంటున్నారు.
ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీకి సంబంధించిన యాత్ర ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది. ఈ నెలలో 1,3,8,10,17,22,.. సెప్టెంబర్ 12,26 తేదీల్లో.. అక్టోబర్ 3,5,10,12,31 తేదీల్లో ఈ యాత్ర ఉంటున్నట్లు సమాచారం. ఈ తేదీల్లో మీకు అనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తిరుపతికి బయలు దేరే విమానం (6E- 2005) హైదరాబాద్‌లో ఒంటి గంటకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.05గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలను దర్శించుకొంటారు. అనంతరం ముందుగా బుక్ చేసుకున్న హోటల్‌కు చేరుకుంటారు. అక్కడే రాత్రి భోజనం ఉంటుంది.
రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత శ్రీవారి దర్శనానికి బయలుదేరతారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం భోజనం ముగించుకొని శ్రీకాళహస్తి స్శామివారి దర్శనం చేసుకుంటారు. తర్వాత తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకొని హైదరాబాద్‌కు పయనమయ్యే విమానం(6E 267) ఎక్కడంతో ప్రయాణం పూర్తవుతుంది.
విమాన ప్రయాణ టికెట్ ధరలు ఒక్కొక్కరికి..
సింగిల్ షేరింగ్ రూ. 16,330
ట్విన్ షేరింగ్ రూ. 14,645
ట్రిపిల్ ఆక్కుపెన్సీ రూ. 14,550
5-11 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులకు
విత్ బెడ్ రూ. 13,740
విత్ అవుట్ బెడ్ రూ. 13,490
2-4 ఏళ్ల మధ్యా చిన్నారులకు రూ. 13,490
2 ఏళ్ల కంటే తక్కువ చిన్నారులకు రూ. 1500 వరకు ఎయిర్‌పోర్టులో చెల్లించాలి.
ఇతర వివరాలు, టికెట్ బుకింగ్ కోసం IRCTC Tourism వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు