విమాన టికెట్లపై ఐఆర్‌సిటిసి ఆఫర్

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) విమాన టికెట్లపై ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థ 24 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా.. టిక్కెట్లు బుకింగ్‌పై కన్వినియన్స్ ఛార్జ్ ఉండదని ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల నుండి ఎలాంటి కన్వినియన్స్ రుసుము వసూలు చేయమని ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెల 25 నుండి 27 వరకు ఉంటుంది. కొన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ప్లేన్ టికెట్లు బుక్ చేసుకుంటే రూ. 2 వేల వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చని ఐఆర్‌సిటిసి వెల్లడించింది. అంతేకాకుండా ఐఆర్‌సిటిసి పోర్టల్ ద్వారా బుక్ చేసుకుంటే ప్రతి టిక్కెట్ కు రూ. 50 లక్షల ప్రయాణ బీమాను కూడా అందింస్తున్నట్లు సమాచారం.