ఎసిబికి చిక్కిన నీటిపారుదల శాఖ అధికారి..

హైదరాబాద్ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లా ఎస్ ఇ కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ముగ్గురు అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్ ఇ కార్యలయంలో ఇఇగా పనిచేస్తున్న భన్సీలీల్, ఎఇలు కార్తిక్, నిఖేశ్ .. ఓ దస్త్రం ఆమోదం కోసం వచ్చిన వ్యక్తి వద్ద రూ. 2.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. సదరు వ్యక్తి ముందుగా రూ. 1.5 లక్షలు ముట్టజెప్పాడు. ఇంకో లక్ష ఇవ్వాల్సి ఉండగా ఎసిబికి ఫిర్యాదు చేశాడు. ముగ్గురిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనంతటికీ అసలు సూత్రధారి అపుడే అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో అధికారులు సుమారు 4 గంటల పాటు శ్రమించి నాలుగో వ్యక్తిని పట్టుకున్నారు.