నిండుకుండలా ప్రాజెక్టులు
శ్రీరాంసాగర్‌కు భారీ వరద 9 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ వరద నీరు వాగులు, నదుల్లోకి చేరుతోంది. ఈ వరద నీటి మూలంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రజెక్టు నుంచి భద్రాచలం వరకు భారీగా ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. గోదావరి ఉపనదుల్లో కూడా భారీ గా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కాళేశ్వరం, భద్రాచలం మధ్య వరద నీరు భారీ చేరడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారిపోయాయి.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో దాదాపు 85,740 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి వేశారు. దాదాపు 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగు కాగా… ప్రస్తుతం 1087.6 అడుగుల వద్ద నీటి మట్టం ఉన్నది. ఇంకా జలాశయంలో 90.3 టిఎంసిల నీటిని నిల్వ చేయవచ్చు..
అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజక్టు వరద ఉధృతి పెరుగుతున్నది. దీంతో అధికారులు 19 గేట్లు ఎత్తివేసి నీటిని కిందికి వదులుతున్నారు.