Israelలో తొక్కిసలాట.. 44 మంది మృతి

జెరూస‌లెం (CLiC2NEWS): Israel లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మౌంట్‌ మెరెన్‌లో తొక్కిసలాటలో తొక్కిస‌లాట జరిగి 44 మంది మృతి చెందారు. మ‌రో వంద మందికిపైగా గాయ‌ప‌డ్డ‌రు. స్థానిక మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. గురువారం అర్ధరాత్రి యూదుల పండుగ లాగ్‌ బౌమర్‌ పండుగ సందర్భంగా వేలాది మంది యూదులు మెరెన్‌కు ప్రార్థనల కోసం తరలివచ్చిన సమయంలో దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 44 మందికిపైగా మృతి చెందారని హిబ్రూ మీడియా తెలిపింది. అయితే ఘటనలో 38 మంది మృతి చెందారని రెస్క్యూ సర్వీసెస్‌ ధ్రువీకరించింది. 20 మందికిపైగా తీవ్ర గాయాలవగా.. పరిస్థితి విషమంగా ఉందని, మరో 39 మందికి తేలికపాటి గాయాలవగా హాస్పిటల్‌కు తరలించారు.

క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ఇక్క‌డ జ‌రిగిన అతిపెద్ద కార్య‌క్ర‌మం ఇదే. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా ఈ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. అయితే ఇప్పుడు అక్కడ టీకా పంపిణీ ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నందున ఈ ఏడాది ఆంక్ష‌లు ఎత్తివేయ‌డంతో అధిక సంఖ్య‌లో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. గురువారం అర్ధరాత్రి ఈ కార్య‌క్ర‌మంలో దాదాపు ల‌క్ష మంది పాల్గొన్న‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.

ఇదిలా ఉండగా ఎండీఏ డైరెక్టర్‌ జనరల్‌ మాట్లాడుతూ ఘటనలో 38 మంది మృతి చెందారని, గాయపడ్డ వారిని సఫెడ్‌లోని జివ్‌ హాస్పిటల్‌, నహరియాలోని గెలీలీ మెడికల్‌ సెంటర్‌, హైఫాలోని రాంబం హాస్పిటల్‌, టెబెరియాస్‌లోని పోరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో సుమారు లక్ష మంది వరకు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. దుర్ఘటనను ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు అతిపెద్ద విషాదంగా పేర్కొన్నారు. దుర్ఘటనలో బాధితుల పక్షాన ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.